• News14

పెద రాయుడుకి పాతికేళ్లు ...

Updated: Jun 16

మోహన్ బాబు కెరీర్ లోనే టాప్ హిట్ గా నిలిచిన పెద రాయుడు విడుదల జరిగి పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు తన అనుభవాలను ఒక వీడియొ రూపం లో పంచుకున్నారు. మొదటగా ఈ సినిమా ఎలా మొదలైoదో చెప్పారు.


రజనీకాంత్ తనకు ఈ సినిమా చూడామని, రైట్స్ కొనమని, చెప్పడాని చెప్పాడు. మోహన్ బాబు తండ్రి పాత్ర లో ఎవరు అని ఆలోచిస్తుంటే తానే చేస్తానని, ఆ పాత్ర కోసమే రైట్స్ తీసుకోమన్నానని చెప్పాడు.


మొదటగా ఈ మూవీ కి డైరెక్టర్ గా రవి రాజా పినిశెట్టి కి చెప్పారని సినిమా చూసిన తర్వాత తను ఒక రోజు గడువు కావాలని అన్నదని దాని మోహన బాబు గారు ఒప్పుకోలేదు. వెంటనే బి. గోపాల్ ని అడిగారాని కానీ తను చేయననడనం, వెంటనే రవి రాజా గారు చేస్తానని అనడంతో ఈ మూవీ పట్టాలేక్కిందని తన అనుభవాలను నెమరువేసుకున్నారు.




ఈ‌ఈ సినిమా ఓపెనింగ్ కి రామ రావు గారు, నాగేశ్వర రావు గారిని ఆహ్వానిచనని, వాళ్ళు ఆశీర్వదించారని చెప్పాడు. విడుదల తర్వాత సినిమా ఘన విజయం సాదించడం అది తన కెరీర్ కి ఎంత గానో ఉపయోగపడిందని వివరించి రజని కాంత్ కి కృతజ్ఞతలు చెప్పుకున్నారు.


కాగా ఈ సినిమా, మాతృక తమిళ భాష లో వచ్చిన 'నట్టామై' కి రీమేక్. ఈ మూవీలో విజయ్ కాంత్, శరత్ బాబు, కుష్బూ మరియు మీనా ప్రదాన పాత్రలలో నటించారు.


ఆ ఇరవై నిమిషాలు రజని కాంత్ స్క్రీన్ పై కనిపించడం మూవీ హిట్ కి ప్రదాన కారణం. ఇందులో రజని కాంత్ కి సాయి కుమార్ వాయిస్ కూడా సరిగ్గా కుదిరింది. కదా ఈ మూవీ లో మోహన్ బాబు డ్యూఎల్ రోల్ లో నటించగా సౌందర్య, భాను ప్రియ లు మోహన్ బాబు సరసన నటించారు. కాగా ఈ మూవీ లో రజనీకాంత్ పవర్ ఫుల్ డియాలోగుఎస్ తో పాటు మోహన్ బాబు చెప్పే ఇంగ్లిష్ డైలాగ్ ఇప్పటికీ ప్రచారణ లో వుంది. ఈ సినిమా కి 'కోటి' అంధించిన సంగీతం ఇప్పటికీ ఆదరణ పొందుతుంది.

Subscibe Here & Get Notifications Directly

Follow Us on Twitter

© All copy rights with news14.info only.