- News14
అనుష్క 'నిశబ్దం' తర్వాత ఫ్లాప్ డైరెక్టర్ తో తరువాత సినిమా
Updated: Jun 14, 2020
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి మరొక వార్త ఫిల్మ్ సర్క్లెస్ లో వైరల్ గా మారింది. ఇప్పటికే లేడి ఓరీఎంటెడ్ మూవీ కి ఒన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. బాహుబలి తర్వాత తన క్రేజ్ ని విశ్వ వ్యాప్తం విస్తరించుకున్న ఈ స్వీటి తర్వాత చేసిన ఓకే ఒక మూవీ 'నిశబ్దం'. ఇంకా తను ఈ మద్య నే టాలీవుడ్ కి వచ్చి 15 యియెర్స్ పూర్తి చేసుకుంది.
'నిశబ్దం' మూవీ రిలీస్ కి సిద్దం గా వుంది మరియు లాక్ డౌన్ వల్ల విడుదల వాయిదా పడింది. 'నిశబ్దం' మూవీ స్టోరీ రచయిత కోన వెంకట్ ఇప్పటికే 'కర్ణం మల్లీశ్వరి' స్టోరీ పై కసరత్తు చేస్తున్నాడు. అనుష్క మాత్రం ఏ మూవీ కి సైన్ చేయలేదు.

కానీ ఇప్పటికే తను యూవి క్రియేషన్స్ తో ఒక మూవీ కి అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్త అనుష్క అభిమానులకు మింగుడు పడటలేదు. ఎందుకంటే తను నటించే తర్వాత సినిమాను దర్శకత్వం చేయబోయిది ఒక ఫ్లాప్ డైరెక్టర్. అవును, 'రా రా కృష్ణయ్య' మూవీ డైరెక్టర్ ఒక లేడి ఓరీఎంటెడ్ సబ్జెక్టు చెప్పినట్టు, స్వీటి అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎటువంటి అఫిషియల్ సమచారం లేదు.
ఇప్పటికే అనుష్క లేడి ఓరియెంటెడ్ సుబ్జెక్ట్స్ చాలా చేసి 'అరుంధతి, 'భాగమతి ' రూపం లో విజయం సాధించింది మరి ఇప్పుడు ఈ కొత్త డైరెక్టర్ తో మూవీ ఎలా వుంటుందో చూడాలి.
Top 5 movies of Bala Krishna all time