• News14

వకీల్ సాబ్ తర్వాత పవన్ కల్యాణ్ చేయబోయే సినిమా వేసవికి విడుదల

పాలిటిక్స్ లో అడుగు పెట్టిన తర్వాత సినిమాలు తగ్గించిన తర్వాత పవన్ కల్యాణ్ మళ్ళీ వకీల్ సాబ్ తో అలరించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ తర్వాత పవన్ కల్యాణ్,

క్రిష్ జాగర్లమూడి తో ఒక ప్రాజెక్టు కన్ఫర్మ్ చేశాడు. అది పూర్తిగా పీరియాడిక్ బేస్ లో వుంటుందని వార్తలు వచ్చయి.


క్రిష్ ఇప్పటికే బాలకృష్ణ తో గౌతమి పుత్రశాతకర్ణి, కంగనా తో ఝాన్సి లక్ష్మిభాయి మూవీలు చేసిన అనుభవం వుంది. కానీ పవన్ కల్యాణ్ ఫస్ట్ టైమ్ పీరియాడిక్ మూవీ లో చేస్తున్నాడు. శాతకర్ణి బాక్సాఫీస్ దగ్గర విజయం సాదించింది కానీ ఝాన్సి మూవీ కి క్రిష్ వివాదాలు యెదుర్కొన్నాడు.




క్రిష్ శాతకర్ణి మూవీ 3 నెలలు లోనే పూర్తి చేసాడు, రాజమౌళి లాగా సమయం తీసుకోడు. ఇప్పటికే బాలయ్య తో తీసిన ఎన్‌టి‌ఆర్ బయోపిక్ బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టింది. కాబట్టి క్రిష్ కి ఈ మూవీ చాలా ప్రత్యేకం మరియు స్క్రిప్ట్ పని పక్ద్బంది గా చేస్తున్నతు వార్తలు వస్తున్నాయి.


పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ ప్రాజెక్టు పై వున్నాడు, ఇది హింది పింక్ మూవీ కి రీమేక్. శ్రీరామ్ వేణు ఈ మూవీ కి దర్శకత్వం చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత క్రిష్ తో చేసే సినిమా వేసవి సెలవలకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.



9 views0 comments