• News14

సుశాంత్ పై కొంతమందికి ఇప్పుడు పుట్టుకొచ్చింది ప్రేమ: సైఫ్ అలీ ఖాన్

సుశాంత్ మరణం భారత దేశ వ్యాప్తం గా వున్న సినిమా ప్రేమికులని ఎంత గానో భాదించింది. కానీ సోషల్ మీడియా లో 'నెపోటిజమ్' మీద చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇండస్ట్రి లో వున్న నెపోటిజం వల్లనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు పెరిగి పోయాయి.


బాలీవుడ్ నటి కంగనా చేసిన వ్యాక్యలు మరింత ఆజ్యం పోశాయి. కంగనా సుశాంత్ మరణం పై స్పందిస్తూ ఇది ఆత్మహత్య కాదని తనకు తెలిసినంత వరకు ఇది హత్య అని, దానికి కారణం ఇండస్ట్రి లో వున్న నెపోటిజం మాత్రమే అని విమర్శించింది. బాలీవుడ్ మొత్తం కొందరి చేతులలో వుంటుందని టాలెంట్ వున్నవారికి చోటు లేదని వెల్లడించింది. సుశాంత్ ఎం.ఎస్ ధోని, చిచోరే లాంటి మంచి మూవీస్ చేసిన అవార్డ్స్ ఇవ్వలేదని కానీ 'గల్లీ బాయ్' కి చాలా అవార్డ్స్ వచ్చాయని. చేసిన పనికి గుర్తింపు లేక పోవడం వల్లనే సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్ళి వుంటాడని చెప్పింది.




సోనమ్ కపూర్ స్పందిస్తూ ఒక వ్యక్తి మరణం కి సరైన కారణం తెలియనప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ ని, తన కుటుంబ సబ్యులని, తన తోటి నటీనటులను నిందించడం సరైన పద్దతి కాదని ట్వీట్ చేసింది. దీని పై తను చాలా ట్రోల్లింగ్ ఎదురుకొంది.


బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ స్పందిస్తూ సుశాంత్ మరణం అందరిని భాదించడం నిజమే కానీ కొంతమందికి కొత్తగా ప్రేమలు పుట్టుకొచ్చాయని, బ్రతికున్నపూడూ ట్విటర్ లో 10 వాక్యాలు రాసే వాళ్ళు కొంతమంది చనిపోయిన తరువాత కామ్ గా వున్నారని చెప్పాడు. సుశాంత్ మరణానికి కేవలం సినిమా విశయాలే కారణం అని తను అనుకోవటల్లేదని, తన వ్యక్తిగత విషయాలు కూడా వుండచని వెల్లడించాడు.


సుశాంత్ ఇప్పటికే సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ తో ఒక సినిమా నటించాడు. కాగా ఇప్పుడు తాను చివరిగా నటించిన 'దిల్ భేచార' ఒటి‌టి లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నతు వార్తలు వస్తున్నాయి.

Subscibe Here & Get Notifications Directly

Follow Us on Twitter

© All copy rights with news14.info only.